భరత్‌భూషణ్‌కు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం


Sat,January 6, 2018 02:03 AM

Bharat Bhushan is an honorary Telugu universal awards

Bharat-bhushan
తెలుగు యూనివర్సిటీ: మూడు దశాబ్దాలుగా ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌లో తెలంగాణ ముద్రను ప్రదర్శిస్తున్న జీ భరత్‌భూషణ్‌కు తెలుగు విశ్వవిద్యాలయం 2016 ఏడాదికిగాను విశిష్ఠ పురస్కారం ప్రకటించింది. సాహిత్యం, లలితకళలు, సాంస్కృతికరంగాల్లో ప్రతిభ కనబర్చినవారికి ఈ అవార్డు ఇస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, జాతర్లు, ఆచార వ్యవహారాలను ఊరూరా తిరిగి తన కెమెరాలో బంధించిన భరత్‌భూషణ్ ఏడు వ్యక్తిగత ఫొటో ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన తీసిన బతుకమ్మ ఫొటోలు ప్రపంచఖ్యాతిని సంపాదించాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డు ఇచ్చింది. 1953లో వరంగల్ జిల్లాలో జన్మించిన భరత్‌భూషణ్ హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ టెక్నాలజీ వర్సిటీ నుంచి ఫొటోగ్రఫీలో డిప్లొమా పొందారు. తన తొలి సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ని 1973లో వరంగల్‌లో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిపై పలు వ్యాసాలు రాశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న చాకలి ఐలమ్మ ఏకైక ఫొటో, కాళోజీ ప్రసిద్ధమైన ఫొటో తీసింది భరత్ భూషణే. ఈ అవార్డుతోపాటు రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందజేయనున్నట్టు తెలుగువర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS