పౌరులూ.. నిఘా నేత్రాలుకండి

Wed,September 11, 2019 02:40 AM

- అనుమానాస్పదంగా ఏది కనిపించినా సమాచారమివ్వండి
- ట్విట్టర్‌లో కోరిన డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాంతిభద్రతల పరిరక్షణలో పౌరులు కూడా భాగస్వాములు కావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ప్రాంతంలో, కాలనీలో, గ్రామంలో, పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలపై కన్నే సి ఉంచాలని సూచించారు. వస్తువులు, వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గణేశ్ నిమజ్జనం అత్యంత శాంతియుతంగా, విజయవంతంగా చేయడంలో మీరూ మాతో చేతులు కలుపండి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఏది కనిపించినా మాకు సమాచారం ఇవ్వండి అని ట్విట్టర్‌లో మహేందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఫేస్‌బుక్‌లో fb.com /dgp telangana, ట్విట్టర్‌లో tweet<\ >telanganadgp లో లేదా 9490616555 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా హాక్‌ఐ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles