బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు


Fri,July 12, 2019 01:42 AM

Basara iiiT Assistant Professor arrested

-ఏ1 నిందితుడు రవి వరాలపై నిర్భయ, ఫోక్సో కేసు నమోదు
-సహకరించిన మరో ఇద్దరు అరెస్టు
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో కలకలం రేపిన కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బాసర పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ శశిధర్‌రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. కళాశాలలో 2011లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెమిస్ట్రీ విభాగంలో హెచ్‌వోడీగా రవి వరాల కాంట్రాక్టు పద్ధతిలో ఎంపికయ్యాడు. ఆయన కన్నా తక్కువ చదివిన (పీజీ) వారికి సమాన వేతనం ఉండటంతో డబ్బులకు ఆశ పడ్డాడు. డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే కక్కుర్తితో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ చేశాడు. పరీక్ష రాసిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే, మళ్లీ ఒక నెల రోజుల్లో పరీక్ష రాసే అవకాశం ఇచ్చాడు. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలు పరీక్ష అనంతరం వాల్యూయేషన్ ఇంచార్జి విశ్వనాథ్ వద్దకు వెళ్తుంటాయి.

విశ్వనాథ్‌కు సైతం సరైన వేతనం లేకపోవడంతో రవి వరాల డబ్బుల ఆశ చూపి విద్యార్థుల సమాధాన పత్రాలను ఎవరికి తెలియకుండా తీసుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు. రవి వరాల, విశ్వనాథ్‌కు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్ కూడా సహకరించేవాడు. రవి వరాల సంబంధిత విద్యార్థులను నిజామాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకొని ఒక్కో సబ్జెక్టుకు రూ.15వేలు తీసుకునే వాడు. ఇలా దాదాపు రూ. 5 లక్షల వరకు డబ్బు సంపాదించాడు. రవి వరాలపై విచారణ జరిపిన పోలీసులు కఠిన కేసులు నమోదు చేశారు. నిర్భయతో పాటు ఫోక్సో కింద కేసు నమోదు చేసి ఏ-1 నిందితుడిగా గుర్తించారు. అతనికి సహకరించిన విశ్వనాథ్‌ను ఏ-2గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధాకర్‌ను ఏ-3గా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. విశ్వనాథ్, సుధాకర్‌ను విధుల నుంచి తొలగించినట్టు కళాశాల అధికారులు తెలిపారు.

126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles