హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం


Thu,September 12, 2019 03:23 AM

Bandaru Dattatreya takes oath as Governor of Himachal Pradesh

హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, తదితరులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం ప్రమాణం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్‌చంద్ చౌదరి ప్రమాణం చేయించారు. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాంఠాకూర్, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్.. దత్తాత్రేయకు అందించి, శాలువాతో సత్కరించారు. హిమాచల్ క్యాప్, సంప్రదాయ దుస్తులు ధరించి దత్తాత్రేయ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకున్న దత్తాత్రేయకు ఆ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు.

నా జీవితంలో నూతన అధ్యాయం

గవర్నర్‌గా ప్రమాణం చేయడం తన జీవితంలో కొత్త అధ్యాయమని దత్తాత్రేయ పేర్కొన్నారు. సిమ్లాలో గవర్నర్‌గా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో అంకితభావంతో పనిచేశానని, ప్రధాని మోదీ, హోంశాఖ మం త్రి అమిత్‌షా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పారు. పర్యాటకంలో దక్షిణాది రాష్ర్టాలను అనుసంధానం చేస్తానని, అధికార, విపక్షాలను కలుపుకొని హిమాచల్‌ను అభివృద్ధికి విద్య, అడవులు, ప్రకృతి, గిరిజన అంశాల్లో కృషిచేస్తానని తెలిపారు.

404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles