ప్రశాంత్‌రెడ్డివైపే బాల్కొండ


Thu,December 6, 2018 02:50 AM

Balkonda is developed More than 50 years

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్‌గా వేముల ప్రశాంత్‌రెడ్డి తనదైన అభివృద్ధి మార్కు వేశారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా మరారు. 2014 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. సివిల్ ఇంజినీరైన ప్రశాంత్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని సాగునీటితోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారు. 2014 ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని మోర్తాడ్‌కు ప్రచారానికి వచ్చిన కేసీఆర్‌కు బీడీ కార్మికుల సమస్యలను వివరించి వారికి జీవనభృతి పథకాన్ని ప్రకటింపజేసిన ఘనత ఆయన సొంతం. నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో వేముల ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌పై 36,248 ఓట్ల మెజార్టీ సాధించారు.

50 ఏండ్లకు మించిన అభివృద్ధి

నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ప్రశాంత్‌రెడ్డి నాలుగున్నరేండ్లలో చేసి ప్రజల కండ్ల ముందు ఉంచారు. నానాటికి నీటిలభ్యత తగ్గిపోతూ వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలన్న కేసీఆర్ ఆలోచనలో భాగస్వామి అయి పునర్జీవ పథకాన్ని తీసుకొచ్చారు. నియోజకవర్గం మధ్య నుంచి 45 కి.మీ. మేర ప్రవహిస్తున్న కప్పల వాగు, పెద్దవాగుల్లో ఏకంగా పన్నెండు చెక్‌డ్యాంలు మంజూరు చేయించి ఆరు చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేయించారు. దీంతో ఈ రెండు వాగులు నీటితో కళకళలాడుతూ భూములకు ప్రాణం పోశాయి. రూ.200 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేశారు. ఏకకాలంలో 12 సబ్‌స్టేషన్లను మంజూరు చేయించి చరిత్ర సృష్టించారు. రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న పసుపు పార్కును మంజూరు చేయించారు.

నియోజకవర్గంలోని మానాల ప్రజలు 40 ఏండ్లుగా కోరుతున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేయించారు. ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరి మానాలకు పీహెచ్‌సీ మంజూరు చేయించారు. లక్ష్మీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించారు. 30 ఏండ్ల నాటి లక్ష్మీ కాలువ ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలమయంగా మారిపోయిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.14 కోట్లు మంజూరు చేయించి గాడిలో పెట్టా రు. భీమ్‌గల్ ప్రాంత ప్రజల సాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు వేముగంటి ప్రాజెక్టును పూర్తి చేయించారు. భీమ్‌గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి పట్టణాభివృద్ధికి రూ.25 కోట్లు మంజూ రు చేయించారు. కమ్మర్‌పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీలను అభివృద్ధి చేశారు. 2,500 కుటుంబాలకు సుమారు రూ.14 కోట్ల సీఎం సహాయనిధి నిధులు మంజూరు చేయించారు.

ప్రచారంలోనూ దూకుడు

నియోజకవర్గ అభివృద్ధిలో దూకుడుగా వ్యవహరించిన ప్రశాంత్‌రెడ్డి.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ప్రశాంత్‌రెడ్డి ఏ గ్రామంలో ప్రచారానికి వెళ్లినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మహాకూటమి తరఫున అనిల్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా రాజేశ్వర్ బరిలో ఉన్నారు. నాలుగున్నరేండ్లలో ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి గడపకూ చేరడంతో లబ్ధిదారులంతా టీఆర్‌ఎస్‌కే జై కొడుతున్నారు. ప్రశాంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి, మరోసారి మెజార్టీలో రికార్డు సృష్టిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు.
vemula-prashanth-reddy-TRS2

2047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles