మగజాతి మాయం!


Thu,September 12, 2019 03:09 AM

Bad news for men

మగవాళ్లకో బ్యాడ్ న్యూస్! మగవాళ్లకే కాదు.. ఒకరకంగా అందరికీ! రాబోయే ఐదు మిలియన్ ఏండ్లలో మగజాతి అంతరించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశోధకులు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జెన్నీ గ్రేవ్స్ అధ్యయనం మానవజాతికి ఆందోళనకర విషయాన్ని వెల్లడిస్తున్నది. మగ, ఆడ అనే తేడాను నిర్ణయించేది మనలోని క్రోమోజోమ్‌లు. ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు, మగవాళ్లలో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. ప్రతి ఎక్స్ క్రోమోజోమ్‌లో వెయ్యికి పైగా జన్యువులుంటాయి. ఇవన్నీ బలమైన జన్యువులే. ఇలాంటి ఎక్స్ క్రోమోజోమ్‌లు రెండు ఉండటంవల్ల జన్యుపరంగా మహిళలు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎక్స్ క్రోమోజోమ్ కన్నా సహజంగానే వై క్రోమోజోమ్ బలహీనమైనది. దీనిలో ఎస్‌ఆర్‌వై అనే ఒకే జన్యువు మగవాళ్ల లింగనిర్ధారణ చేస్తుంది. మిగిలిన జన్యువులన్నీ పెద్దగా ఉపయోగపడనివే. ఎక్స్ క్రోమోజోమ్ తన లోపాలను పూడ్చుకోవడానికి మరొక క్రోమోజోమ్‌తో జతకడుతుంది. ఆడవాళ్లలో ఎక్స్ క్రోమోజోమ్‌తోనే జత అవుతుంది కాబట్టి మరింత బలంగా ఉంటుంది. కానీ మగవాళ్లలో బలహీనమైన వై క్రోమోజోమ్‌తో జతకట్టాల్సి ఉంటుంది. కాబట్టి చాలామటుకు ఎక్స్ క్రోమోజోమ్ మరో ఎక్స్ క్రోమోజోమ్‌నే ఎంచుకుంటుంది. ఒంటరిగా ఉండే వై క్రోమోజోమ్ నిలబడలేదు. దాంతో వై క్రోమోజోమ్ కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ప్రొఫెసర్ జెన్నీ చెప్తున్నారు. భవిష్యత్‌లో ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి మరి.

1935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles