మందిర్‌కు బంగారు ఇటుక ఇస్తా


Mon,August 19, 2019 02:16 AM

Baburs descendant wants to donate brick for Ayodhya Ram Temple

-బాబ్రీ స్థలాన్ని ఇస్తే రామమందిరానికి మొదటి ఇటుక నాదే
-మొఘల్ వంశస్థుడు హబీబుద్దీన్ టసీ పునరుద్ఘాటన

హైదరాబాద్: బాబ్రీ మసీదు-రామజన్మభూమి స్థలాన్ని తనకు ఇస్తే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మొదటి ఇటుకను తానే ఇస్తానని, అది కూడా బంగారు ఇటుకను ఇస్తానని గతంలో చేసిన ప్రతిపాదనను హైదరాబాద్‌లో నివసిస్తున్న మొఘల్ వంశస్థుడు హబీబుద్దీన్ టసీ (50) పునరుద్ఘాటించారు. అలాగే ఆ మొత్తం స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగిస్తానని టసీ శనివారం ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన బహదూర్‌షా జఫర్‌కు ఆరో తరం వారసుడైన టసీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ ప్రతిపాదన చేశారు. బాబ్రీ మసీదు వివాదంలో తనను కూడా కక్షిదారుగా చేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 8న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు ఇంకా అంగీకరించలేదు.

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles