బాహుబలి-2 జైత్రయాత్రSat,May 20, 2017 02:59 AM


- టార్గెట్ 2000 కోట్లు
- 21 రోజుల్లో 1,502 కోట్ల వసూళ్లు
- ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనం

bahubali
భారతీయ సినీ యవనికపై నవ్య చరితను లిఖిస్తూ బాహుబలి-ది కన్‌క్లూజన్ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా బాహుబలి-ది కన్‌క్లూజన్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల సునామీలో గతంలో ఉన్న పలు రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. 1000 కోట్ల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రపుటలకెక్కిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే 1500 కోట్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. తొలి 10 రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఈ చిత్రం 21రోజుల్లో 1500కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకున్నది. దేశంలో 1,227 కోట్లు, విదేశాల్లో 275 కోట్లు కలుపుకొని మొత్తంగా 1,502 కోట్లు వసూళ్ల్లను సాధించిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. లాంగ్న్(్రపూర్తి ప్రదర్శన)లో ఈ చిత్రం 2000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అందుకోవడం సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా 9000 కేంద్రాల్లో విడుదలై ంది. ఈ ఏడాది ఆఖరులో చైనా, జ పాన్‌లో కూడా భారీస్థాయిలో విడుద ల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

బాలీవుడ్‌లో 460 కోట్లు


హిందీ చిత్రసీమలో బాహుబలి-2 ప్రభంజనం కొనసాగుతున్నది. అక్క డ మొదటివారంలో 247 కోట్లు, రెండోవారంలో 143.25 కోట్లు, మూడోవారంలో 69.75 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం గా మూడువారాల్లో 460 కోట్ల కలెక్షన్లు రాబట్టి గతంలో ఉన్న రికార్డులన్నింటిని అధిగమించింది. ముఖ్యంగా మూడోవారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డుని సొంతం చేసుకున్నది. గతంలో దంగల్ మూడోవారంలో 44.2 కోట్ల కలెక్షన్స్ సాధించగా, ఈ రికార్డును బాహుబలి-2 బద్ధలుకొట్టింది. బాహుబలి-2 హిందీలో 460 కోట్ల మైలురాయిని దాటిందని, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి క్రేజ్ కొనసాగుతున్నదని చిత్రాన్ని హిందీలో పంపిణీ చేసిన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
bahubali1

తెలుగు రాష్ర్టాల్లో సునామీలా వసూళ్లు


ఉభయ తెలుగు రాష్ర్టాల్లో బాహుబలి- ది కన్‌క్లూజన్ వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. తొలిరోజే రెండు రాష్ర్టాల్లో 55 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. మూడోవారంలో ఇరు రాష్ర్టాల్లోని అన్ని ప్రాం తాలను కలుపుకొని 177 కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రాంతాల వారీగా తెలంగాణ 60.73 కోట్లు, సీడెడ్ 30.80 కోట్లు, వైజాగ్ 23.38 కోట్లు, తూర్పుగోదావరి 15.63 కోట్లు, పశ్చిమగోదావరి 11.44 కోట్లు, కృష్ణా 12.67 కోట్లు, గుంటూరు 16.19 కోట్లు, నెల్లూరు 6.95 కోట్లు వసూళ్లు చేసింది.
patika

సింగపూర్‌లో పిల్లలకు నోఎంట్రీ


ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్న బాహుబలి-2 సినిమాను వీక్షించడానికి సింగపూర్‌లో పిల్లలకు అనుమతి లేదు. ఈ సినిమాలో ఉన్న రక్తపాతం కారణంగా సింగపూర్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను జారీచేస్తూ 16 ఏండ్ల లోపు పిల్లలు బాహుబలి-2ను చూడడానికి అనుమతిని నిరాకరించింది. సింగపూర్‌లో మాత్రమే కాకుండా ఆసియా, యూరప్‌లోని చాలా దేశాల్లో బాహుబలి-2 సినిమాకు ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

1908

More News

VIRAL NEWS