కాలుష్య నియంత్రణకు కమిటీలు


Fri,July 12, 2019 02:08 AM

Awareness on solid waste management

-జిల్లా ప్రణాళికలు రూపొందించండి
-ఘన వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టండి
-అన్ని దవాఖానలను ఇన్సులేటరీ యూనిట్స్‌తో ట్యాగ్ చేయండి
-వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్ ఎస్కే జోషి ఆదేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అన్ని రకాల కాలుష్యాలను అరికట్టడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా రూపొందించాలని సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక కేసులో జారీచేసిన ఉత్తర్వుల అమలుపై గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో మెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, వాయు కాలుష్యం, ఇసుక మైనింగ్ తదితర అంశాలపై జిల్లా కమిటీలు ప్రతినెలా సమావేశమై మినిట్స్ పంపడంతోపాటు త్రైమాసిక నివేదికలు అందజేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ జీడిమెట్లలో ఏర్పాటుచేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటును మున్సిపల్ కమిషనర్లకు చూపించి.. ఆయా మున్సిపాలిటీల్లో అదేవిధంగా మొదలుపెట్టేలా చర్యలు తీసుకొనేలా చూడాలని చెప్పారు.

ప్రతి జిల్లాలో కనీసం మూడు గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, అన్ని గ్రామాలు, పట్టణాల్లో డంపింగ్ యార్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలన్నారు. వినియోగంలో లేని క్వారీలను ఘన వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానలను 11 ఇన్సులేటరీ యూనిట్స్‌తో ట్యాగ్ చేయాలని చెప్పారు. నదుల్లో కాలుష్యాన్ని అరికట్టడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వ్యర్థాలు నదుల్లో కలుపకుండా చూడాలన్నారు. వాయు కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చోట ఎయిర్ క్వాలిటీ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, పీసీబీ సభ్యకార్యదర్శి అనిల్‌కుమార్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ మానిక్‌రాజ్, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్, డైరెక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles