రచయిత, చరిత్రకారుడు మచ్చ ప్రభాకర్ మృతి


Wed,January 24, 2018 01:37 AM

Author and historian Machha Prabhakar Passes Away

macha-prabhakar
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ రచయిత, తెలంగాణ కవి మచ్చ ప్రభాకర్ మంగళవారం ఉదయం ముంబైలో మరణించారు. ప్రభాకర్ సిరిసిల్ల నుంచి నాలుగు దశాబ్దాల క్రితం ముంబైకి వలసపోయారు. అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముంబైలో తెలంగాణ ధూంధాం కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవలే ఆయన సతీమణి మృతిచెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన సిరిసిల్లలో జరుగుతాయి. ముంబైలో తెలంగాణ ఉద్యమవాణిని వినిపించిన కవి, రచయిత ప్రభాకర్ మృతి తీరనిలోటని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles