ఆస్ట్రేలియాలో గ్రీన్‌చాలెంజ్‌

Mon,November 11, 2019 01:47 AM

- మొక్కలు నాటిన ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్‌


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమానికి దేశంలోనే కాకుండా ఖండాంతరాల్లో కూడా మంచి స్పందన లభిస్తున్నది. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను ఆ దేశ డిప్యూటీ స్పీకర్‌ జాసన్‌ఉడ్‌ స్వీకరించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన వీడియో సందేశాన్ని తెలంగాణ సమాజానికి పంపించారు. గ్రీన్‌చాలెంజ్‌లో ఇప్పటికే మూడున్నర కోట్ల మొక్కలను నాటడం ప్రశంసనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను తెలుసుకొని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, విక్టోరియా స్టేట్‌ ఇంచార్జి సాయిరా ఉప్పు, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ సాయియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా సినీనటుడు రాజీవ్‌ కనకాల తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ సంస్థ ప్రతినిధి రాఘవ ఇచ్చిన గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన ఆదివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘం నాయకులు కిశోర్‌గౌడ్‌, సినీనటుడు కాదంబరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
GREEN-CHALLENGE1

122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles