అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలి


Thu,May 16, 2019 02:16 AM

Assigned lands should be sorted

హైదరాబాద్ నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. రైతుబంధు పథకం అన్నదాతల ముంగిట పచ్చదనాన్ని పరిచింది. భూముల ప్రక్షాళన పేరిట రైతులకు పట్టాలు అందించి వాటిని క్రమబద్ధీకరించారు. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు ప్రతి రైతుకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. రైతులు నేడు సుఖంగా నిద్రపోతున్నారంటే ఆ పుస్తకాలే కారణం. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు అభినందనలు. ఇదే సమయంలో అసైన్డ్ భూములు కలిగిన రైతులకు వారి పేరిట క్రమబద్ధీకరించి పట్టాలు అందిస్తే వారు మరింత సంతృప్తిచెంది పొలాలను సస్యశ్యామలంచేసి దేశానికి వెన్నెముకగా నిలుస్తారు. అప్పుడు దేశంతోపాటు తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా పదడుగులు ముందుకు సాగుతుంది. దీనివల్ల వాస్తవంగా అనుభవదారు అయిన రైతులకు మేలు కలుగుతుంది. ఎన్టీఆర్ హయాంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసిన అనంతరం రెవెన్యూ శాఖలో అసైన్డ్ భూముల విషయంలో లంచగొండితనం పెట్రేగిపోయింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఈ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కరప్షన్ కనిపించకుండా చేస్తారని ఆశిస్తున్నాను. వాస్తవ అసైన్డ్ అనుభవదారులను గుర్తించి వారిపేరిట ఉన్న భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియను త్వరగా పరిశీలించాలని కోరుతున్నా.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles