కళాకారుడు భిక్షపతి మృతి


Sat,September 5, 2015 01:08 AM

artist bhiksapati died

ఖమ్మం కల్చరల్: ప్రజా గాయకుడు, కళాకారుడు దేవరకొండ భిక్షపతి శుక్రవారం అనారోగ్యగంతో మృతిచెందారు. ఆయన రాసిన నిన్ను విడిచి ఉండలేనమ్మా.. ఓ పాటమ్మ... ఎన్నడూ మరువలేనమ్మా ఓ పాటమ్మా.. చాలా పేరు పేరొందింది. ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన భిక్షపతి అనేక పాటలను రచించి, పాడి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అనేకసార్లు ధూంధాం వేదికలపై గజ్జకట్టి గళం విప్పారు.

తెలంగాణకు ఆంధ్రా వలస పాలకులు చేస్తున్న ఆన్యాయంపై, రాష్ట్రం రావటం వల్ల జరిగే అభివృద్ధిని పాటల ద్వారా వివరించి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉద్యమం సందర్భంగా అనేకసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. ఉద్యమ సమయంలో పోలీసులు నిర్బంధించినప్పడు, పోలీసుల ఇబ్బందులపైనా పాటను రాసి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యమకాలంలో భిక్షపతి సేవలను గుర్తించిన ప్రభుత్వం, సాంస్కృతిక సారథి ఉద్యోగాన్ని ఇచ్చిగౌరవించింది. ఆయన మృతిని కళాకారులు తట్టుకోలేకపోతున్నారు.

487
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS