క్యాన్సర్ చికిత్సలో ఆర్కిటిక్ శిలీంధ్రాలు


Wed,February 20, 2019 01:54 AM

Arctic fungi in the treatment of cancer

-ఐఐటీ హైదరాబాద్ ఘనత
-ల్యుకేమియా చికిత్సలో ముందడుగు

సంగారెడ్డి చౌరస్తా: చిన్నపిల్లల్లో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా (ఏఎల్‌ఎల్) చికిత్సలో హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు కీలక ఆవిష్కరణ చేశారు. హైదరాబాద్ ఐఐటీ, గోవాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఆండ్ ఓషన్ రీసర్చ్ (ఎన్సీపీవోఆర్) పరిశోధకులు కలిసి ఆర్కిటిక్ ప్రాంతంలో జీవించే శిలీంధ్రాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ శిలింధ్రాల నుంచి విడుదలయ్యే ఎల్-ఆస్పరాజినేజ్ అనే ఎంజైమ్‌ను వినియోగించడం ద్వారా సైడ్‌ఎఫెక్టులు తగ్గి, మంచి ఫలితాలు వస్తాయని గుర్తించారు. అసోసియేట్ ప్రొఫెసర్ దావేరి సంతోష్‌కుమార్ ఈ బృందానికి సార థ్యం వహిస్తుండగా, డాక్టర్ అసిఫ్‌ఖురేషి, అ నూప్ అశోక్, కృతిదరియా, జ్యోతివిఠల్‌రావు, గోవానుంచి డాక్టర్ అనూప్‌కుమార్ తివారీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనేది చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్. చికిత్సలో భాగంగా కీమోథెరపిక్ ఏజెంట్‌గా ఎల్-ఆస్పరాజినేజ్ అనే ఎంజైమ్‌ను వినియోగిస్తున్నారు. ఇది క్యాన్సర్ కణా ల ఎదుగుదల, విభజనలో కీలకమైన ఆస్పిరిన్ అనే అమైనోయాసిడ్ విడుదల కాకుండా నివారిస్తుంది.

dr-asif-qureshi2
ఫలితంగా వ్యాధి అదుపులోకి వస్తుంది. ఈ ఎంజైమ్‌ను మనచుట్టూ వాతావరణంలో లభించే ఈ-కొలి, ఎర్వినియా క్రైసాంథెమి వంటి శిలీంధ్రాల నుంచి సేకరిస్తున్నారు. ఈ ఎంజైము ఒంటరిగా లభించదు. గ్లుటామైసిన్, యూరియేజ్ అనే ఎంజైమ్‌లతో కలిసి ఉంటుంది. వీటివల్ల రోగుల్లో పాంక్రియాటిస్ట్స్, హెమోస్టాసిస్ అబ్‌నార్మాలిటీస్, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావడం వంటి దుష్ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైడ్ ఎఫెక్టులు తగ్గించే అంశంపై ఐఐటీ హైదరాబాద్ బృంద సభ్యులు దృష్టిపెట్టారు. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరిగే సైక్రోఫిలీస్ అనే శిలీంధ్రాలు ఎల్-ఆస్పరాజినేజ్‌కు ప్రత్యామ్నాయ వనరుగా ఉపయోగపడుతుందని గుర్తించారు. ఇవి మైనస్ 10 డిగ్రీల నుంచి మైనస్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే జీవిస్తాయని, వీటి నుంచి ఎల్-ఆస్పరాజినేజ్ ఎంజైమ్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని తే ల్చారు. ఇది శరీరంలో సులభంగా కలిసిపోతున్నదని, ఏఎల్‌ఎల్ క్యాన్సర్ చికిత్సలో సమర్థంగా పనిచేస్తుందని నిర్ధారించారు.

713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles