ఏపీ మంత్రి కాన్వాయ్ వాహనం బోల్తా


Thu,September 13, 2018 12:49 AM

AP Minister Adinarayana Reddy Car Rollover

-కుటుంబంతో కలసి చంద్రబాబు పోలవరం గ్యాలరీ వాక్
అమరావతి (పోలవరం), నమస్తే తెలంగాణ: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో బుధవారం అపశృతి చోటుచేసుకున్నది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా పడింది. కారులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే స్థానిక దవాఖానకు తరలించారు. ప్రమాదం గురించి మంత్రిని ఆరాతీసిన సీఎం చంద్రబాబు విచారణ చేపట్టాలని ఆదేశించారు. గతంలో కూడా దెందులూరు సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణిస్తున్న బస్సు మట్టిలో దిగబడటంతో.. వేరే వాహనాల్లో పోలవరం వెళ్లాల్సి వచ్చింది. ఇలాఉండగా, పోలవరం స్పిల్‌వే అంతర్భాగంలో భాగంగా నిర్మించిన గ్యాలరీని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం తన కుటుంబసభ్యులు, స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు గ్యాలరీ వాక్ చేపట్టారు.

2956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles