ఏపీలో ఇసుక రవాణా బంద్


Wed,June 12, 2019 01:13 AM

AP government stops sand mining with immediate effect

-త్వరలో నూతన ఇసుక విధానం
-గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలో మంగళవారం నుంచి ఇసుక రవాణా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొత్త ఇసుక విధానం వచ్చేంతవరకు ఇసుక రవాణాచేయడానికి వీల్లేదని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఇసుక రవాణాపై కొత్త విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని, జూలై ఒకటిలోపు దానిని తీసుకొస్తామని మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. ఇసుక స్మగ్లింగ్‌కి నేటినుంచి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశాలిచ్చామని పెద్దిరెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles