అక్బరుద్దీన్ కోలుకోవాలి


Wed,June 12, 2019 01:16 AM

AP CM YS Jagan in Twitter Prays for Akbaruddin Owaisi Health Recovery

-ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనారోగ్యంతో లండన్‌లో చికిత్స పొందుతున్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు మంగళవారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆరోగ్యం కుదుటపడుతున్నదని మజ్లీస్‌పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్‌ను కలిసిన కర్ణాటక సీఎం తనయుడు
ఏపీ సీఎం జగన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మర్యాదపూపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయానికి రాగా.. సీఎం జగన్ నిఖిల్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించారు. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్ పేర్కొన్నారు.

921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles