నేటినుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు


Wed,June 12, 2019 01:14 AM

AP Assembly meetings from today

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణం, గురువారం స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారం జరుగనున్నది. శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో శాసనసభకు సెలవు. 18వ తేదీతో సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తొలి క్యాబినెట్ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకాశమంతఎత్తుకు ఎదిగారని అన్నారు. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభంకాగానే తొలుత సీఎం వైఎస్ జగన్, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణంచేస్తారని తెలిపారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles