గుడితండాలో కాకతీయ శాసనం


Thu,April 26, 2018 02:15 AM

Another Kakatiya inscription discovered

-ఒకే శాసనంలో గణపతిదేవుని బిరుదులు
-గుర్తించిన తెలంగాణ కొత్త చరిత్ర బృందం
gudi-thanda
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాకతీయ చక్రవర్తి గణపతిదేవ మహారాజు బిరుదులను పేర్కొంటున్న శాసనాన్ని తెలంగాణ కొత్త చరిత్ర బృందం గుర్తించింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలోని రాజరాజేశ్వరిస్వామి దేవాలయంలో ఉన్న ఈ శాసనాన్ని పరిశోధకుడు అరవింద్‌ఆర్య గుర్తించారు. గణపతిదేవుడికి ఉన్న బిరుదులన్నింటినీ ఈ శాసనంలో పేర్కొన్నారని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ నిర్ధారించారు. గుడితండాలో ప్రస్తుతం రాజరాజేశ్వరస్వామి దేవాలయంగా పిలుస్తున్న ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయం అని పిలిచినట్టు శాసనంలో ప్రస్తావించారు. శాసనంలోని 12, 13వ పంక్తులలో అస్మాద్యన్న హి రాజగజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్యా అని పేర్కొన్నారు. ఈ మూడు బిరుదులను ఇప్పటివరకు లభించిన వేర్వేరు కాలాలకు చెందిన కాకతీయ శాసనాల్లో గుర్తించారు. గణపతిదేవుడికి ఉన్న మూడు బిరుదులను పేర్కొన్న శాసనం ఇదొక్కటేనని, కాకతీయుల చరిత్ర పరిశోధనకు ఇది ఒక ఆధారంగా నిలువనున్నదని హరగోపాల్ చెప్పారు. ఈ శాసనంలోని రాజగజకేసరి అన్న బిరుదు ఆయన సార్వభౌమత్వాన్ని నిరూపిస్తుంది. ఈ మూడు బిరుదులు కాకతీయుల నాణేలను గుర్తించడానికి దోహదపడుతాయని బృందం అభిప్రాయపడింది.

1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles