ఆలయంపై ఆంధ్రజ్యోతి అక్కసు

Thu,December 5, 2019 03:02 AM

-నిన్నటివరకు నిర్మాణంపై.. నేడు మూలవిరాట్‌పై పిచ్చిరాతలు
-యాదాద్రికి పూర్వవైభవాన్ని తెస్తున్న సీఎం కేసీఆర్
-జీర్ణించుకోలేకపోతున్న పచ్చపత్రిక.. నాడు భద్రాద్రిపైనా అదే ధోరణి
-ఏడాదిన్నర క్రితమే సిందూరం తొలిగించామన్న ప్రధానార్చకులు
-రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ పత్రిక ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మల దహనం
-ఆంధ్రజ్యోతి ప్రతులు కాల్చిపారేసిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంటే.. ఆ పత్రికకు నిద్రపట్టదు! తెలంగాణ అభివృద్ధి చెందటం అంటే.. జీర్ణంకాదు! అం దుకే విషపురాతలు.. వెకిలి వ్యాఖ్యలు! గతం లో భద్రాద్రి విషయంలోనూ రాముడా.. రా మ నారాయణుడా అంటూ దుమారం లేపి.. భక్తులను అయోమయానికి గురిచేసి పబ్బంగడుపుకొన్న ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఏకంగా యాదాద్రి ఆలయం పునర్వైభవానికి సిద్ధపడుతుంటే.. కడుపుమండి పతాకశీర్షికల్లో తన పైత్యాన్ని వాంతిచేసుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! యావత్ ప్రపంచం అ ద్భుతం అంటూ కీర్తిస్తున్న యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులపై మొన్నటిదాకా అక్కసు చూపిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఏకంగా మూలవిరాట్ విషయంలోనే విషంగక్కేలా తప్పడు వార్తలు ప్రచురిస్తున్నదని భక్తకోటి మండిపడుతున్నది. యాదాద్రిని ప్రపంచంలోనే శ్రీవైష్ణవ దేవాలయాలకు దిక్సూచిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న పనులపై మూడేండ్లుగా ఆంధ్రజ్యోతి ఏదో ఒక తీరున అసహనాన్ని వ్యక్తంచేస్తూనే ఉన్నది. మరికొద్ది రోజుల్లో నిజరూప దర్శనాల వేడుకలకు యాదాద్రి నరసింహుడు సిద్ధమవుతున్న తరుణంలో ఆ పత్రిక అబద్ధపు వార్తలు పరాకాష్టకు చేరుకున్నాయని భక్తులు మండిపడుతున్నారు.

మూలవర్యులు కనిపించనంత సిందూరం!

శ్రీలక్ష్మీనరసింహస్వామివారి మూలవరులకు ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు జరిగినా సిందూరంతో అలంకరణ చేస్తారు. వందేండ్ల నుంచి ఇలాగే చేస్తున్నారు. చివరికి మూలవరులు కనిపించనంత మందంలో సిందూరం పేరుకుపోయింది. అందుకే మూలవిరాట్‌పై ఏడాదిన్నర క్రితమే సిందూరం తొలిగించామని ఆలయ అర్చకులు స్పష్టంచేస్తున్నారు. సిందూరం తొలిగింపు కార్యక్రమాన్ని ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఏడాదిన్నర కిత్రమే నిర్వహిస్తే.. ఇప్పుడు జరిగినట్లు ఎందుకు చిత్రీకరిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏడాదిన్నర క్రితమే తొలిగించాం

సింహాచలంలో ప్రతి ఏడాది చందనోత్సవం జరిపి అప్పన్న విగ్రహానికిగల చందనమంతా తీసి కొత్త చందనం పూస్తారు. తిరుమలలో ప్రతి పన్నెండేండ్లకోసారి కళావరోహణం నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహానికి పేరుకుపోయిన సిందూరం, ఇతర పదార్థాలను తొలిగించి, కొత్త హంగులు అద్దుతారు. అలాంటిదే యాదాద్రిలో నిర్వహించాం. ఆలయాన్ని పునర్నిర్మించేవేళ.. మూలవర్యుల విగ్రహాలు భక్తులకు చక్కగా కనిపించాలన్న తపనతో చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా కళావరోహణము నిర్వహించి, ఏడాదిన్నర క్రితం సిందూ రం తొలగించాం అని ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు వెల్లడించారు. మూలవరులకు గల సిందూరం తొలిగించడం వల్ల నిజమూర్తి దర్శనమిచ్చారు. ఎన్నోఏండ్లుగా పేరుకుపోయిన సిందూరం వల్ల.. వెలిసిన మూర్తి కనిపించని పరిస్థితి ఏర్పడింది. కొన్నేండ్ల నుంచి సిందూ రం పేరుకుపోవడం వల్ల దానిలో క్రిమికీటకాలు పేరుకున్నాయి.

వాటిని తొలిగించాలనే ఉద్దేశంతో శ్రీస్వామివారికి ఏడాదిన్నర కిత్రమే శాంతిపూజలు నిర్వహించి శాస్ర్తోక్తంగా సిందూ రం తొలిగించాం. నరసింహుడు హిరణ్యకశ్యపుడిని చంపినప్పుడు మాత్రమే ఉగ్రమూర్తి. అమ్మవారు శ్రీవారి అంకపీఠంపై కూర్చోగానే దివ్యమంగళమూర్తిగా, శాంతమూర్తిగా మారిపోయి భక్తులను యాదాద్రి లో ఉద్ధరిస్తున్నారు. సిందూరం తొలిగిస్తే ఉగ్రమూర్తిగా మారాడనే కథనం పూర్తిగా అబద్ధం. సింహరూపుడైన నారసింహునికి కోరలు సహజం. శ్రీవారి దంతాలు బయటకు కనిపించినంత మాత్రాన ఉగ్రరూపుడంటే ఎలా? పనిగట్టుకుని ప్రచారం చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న వేళ నరసింహుని భక్తులకు తీవ్ర మానసిక వేదన కలిగించాలనే దుర్మార్గం స్పష్టంగా కన్పిస్తున్నది. ఆలయంలో కొంతమంది అర్చకులు కావాలని కుట్ర పన్ని బద్నాం చేస్తున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడు శాంతమూర్తిగానే ఉన్నారు అని వారు పేర్కొన్నారు.

ఆనాడు భద్రాద్రిపై దుష్ప్రచారం

భద్రాచలం, నమస్తే తెలంగాణ: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలక్షేత్రం విషయంలో కూడా ఆంధ్రజ్యోతి గతంలో రాద్ధాంతం చేసిందని, రాముడా...రామనారాయణుడా అనే అం శంతో అయోమయానికి గురిచేసిందని భక్తులు పేర్కొంటున్నారు. భద్రాద్రీశునకు జరుగుతున్న ఘోరాపచారం అనే పుస్తకం సైతం పెను వివాదానికి దారితీసింది. ఆలయ అర్చకులు.. ఆ పుస్తకాన్ని చించివేసి మరీ తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం క్షేత్రం పాంచరాత్రాగమన ప్రకారం శ్రీవైష్ణవ సంప్రదాయమే కొనసాగుతుందని స్పష్టంచేశారు.
andhrajyothinews2

గాలి వార్తలా ఉంది..

యాదాద్రిపై ఆంధ్రజ్యోతి కథనం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నది. ఇది గాలివార్తలాగా ఉన్నది. సిందూరం, శుభ్రపరచడం విషయంలో ప్రధాన అర్చకులు, శిల్పి వాస్తవ విషయాలు పేర్కొన్నారు. నిర్థారణ లేకుండా నిర్ణయం రాయడం భక్తులను అయోమయానికి గురిచేస్తుంది. మీడియా సంయమనం పాటించాలి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అర్హత ఎవ్వరికి లేదు.
- స్థలసాయి, భద్రాచలం రామాలయం స్థానాచార్యులు

3202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles