ఖమ్మం దవాఖాన ఘటనపై విచారణ


Wed,June 12, 2019 01:18 AM

An inquiry on Khammam government hospital

మయూరిసెంటర్: ఖమ్మం ప్రభుత్వదవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం లో ఈ నెల 9న ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు స్లైన్ పెట్టిన ఘటనపై మంగళవారం అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా విచారించారు. 48 గంటల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆర్‌ఎంవో కృపాఉషశ్రీని ఆదేశించారు. ఇదే ఘటనపై సోమవారం రాష్ట్ర విజిలెన్స్ అధికారి డాక్టర్ రాజశేఖర్‌బాబు విచారణ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా రెండు గంటలపాటు ప్రసూతి విభాగానికి చెందిన ఫైళ్లను, రిజిస్టర్లను పరిశీలించా రు. ప్రభుత్వవైద్యులు, ఆర్‌ఎంవో, న ర్సింగ్ సిబ్బందిని ఆ రోజు జరిగిన అం శాలపై ఆరా తీశారు. నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్టు వెల్లడించారు.

672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles