అమరులను స్మరించుకుందాం


Thu,September 12, 2019 03:03 AM

Allola indarkiran reddy forest minister ne aaj nahru zoological parkmain yaum e shaheedan ki taqrib

- అటవీ అమరవీరుల సంస్మరణదినంలో మంత్రి అల్లోల

చార్మినార్: అటవీ సంపద పరిరక్షణలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుందామని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జూపార్క్‌లో బుధవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరులకు నివాళులర్పించిన ఇంద్రకరణ్‌రెడ్డి.. వృక్షాలు, వన్యప్రాణులు ఎంతో విలువైన సంపదని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాం జరుపుకొంటున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది దుండగుల చేతిలో వీరమరణం పొందారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్ శోభ, అటవీ అధికారులు పృథ్వీరాజ్, రఘువీర్, మునీంద్ర, లోకేశ్‌జైస్వాల్, డొబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, పర్గెయిస్ తదితరులు పాల్గొన్నారు.

109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles