అల్లం నారాయణ పదవీకాలం పొడిగింపు


Thu,July 14, 2016 02:56 AM

Allam Narayana continues as Press Academy Chairman for three years

-రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా మరో మూడేండ్లు పొడిగిస్తూ జీవో జారీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో మూడేండ్లు పొడిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమాచారశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ జీవో నం.1566 ద్వారా ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 జూలై 14న అకాడమీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అల్లం నారాయణ పదవీ కాలం ఈనెల 13తో ముగిసిం ది. ఈ నేపథ్యంలో 30 జూన్ 2019 వరకు ఆయననే చైర్మన్‌గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైర్మన్‌తో పాటు ప్రెస్‌అకాడమీ సభ్యుల పదవీకాలాన్ని కూడా పొడిగించింది. ఈ సమాచారం తెలియగానే ప్రెస్ అకాడమీ అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు అల్లం నారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
narayana
మూడు దశాబ్దాలుగా జర్నలిజానికి సేవలు: మూడు దశాబ్దాలకుపైగా పత్రికారంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ సీనియర్ జర్నలిస్ట్. కరీంనగర్ జిల్లా మంథనిలో 1958లో జన్మించిన ఆయన వామపక్ష భావజాల కుటుంబ నేపథ్యంలో పెరిగారు. తెలంగాణ మాండలిక నవలలతో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే సంచనాలు సృష్టించిన అల్లం రాజయ్య, పాటల రచయిత అల్లం వీరయ్య ఈయనకు సోదరులు. ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీలో ఎంఏ చేసిన నారాయణ మొదట కరీంనగర్ నుంచి వెలువడిన జీవగడ్డలో పనిచేశారు. అప్పట్లోనే ఆయన ఆ పత్రికలో రాసిన వెన్నెలకోనల్లో అనే కాలమ్‌కు విశేష పాఠక ఆదరణ లభించింది. అప్పుడే యాది మనాది, జగిత్యాల పల్లె కవితా సంకలనాలను వెలువరించారు. తరువాతి కాలంలో ఆంధ్రప్రభ (బెంగళూరు), ఆంధ్రజ్యోతి (విజయవాడ) ఎడిషన్లలో సీనియర్ జర్నలిస్టుగా, నమస్తే తెలంగాణ దినపత్రికకు వ్యవస్థాపక ఎడిటర్‌గా సేవలదించా రు. ఆంధ్రజ్యోతిలో ప్రాణహిత, అల్లంకారం, లైఫ్‌లైన్ కాలమ్‌లు రాశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమై 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావించాక తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరంను ఏర్పరిచి ఉద్యమంలో ముందువరుసలో నిలిచారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా..: జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయ ణ పేర్కొన్నారు. తన పదవీకాలా న్ని ప్రభుత్వం పొడిగించిన సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల్లు, హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ల మంజూరు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వాటి ని సాధించడమేగాక జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాన ని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రెస్ అకాడమీకి ఇచ్చిన నిధులు ఇప్పటికే రూ.20 కోట్లకు చేరుకున్నాయని, ఈ నిధితో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటు చేసుకున్నామని, ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో దీనికి అధ్యక్షుడిగా ఉన్న తాను జర్నలిస్టుల సంక్షేమంకోసం పాటుపడుతానన్నారు.

2989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles