ఫెటోను అరికట్టేందుకు అన్నిదేశాలు ముందుకురావాలి


Fri,July 12, 2019 02:07 AM

All countries must come forward to curb the  FETO terrorist group

-హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఫెటో నీడలు
-టర్కీ కాన్సులేట్ జనరల్ అద్నాన్ అల్టే అల్టీనోర్స్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫెటో ఉగ్రవాద సంస్థను అరికట్టేందుకు ప్రపంచదేశాలు ముందుకురావాలని, ఫెటో సామాజిక సంస్థ కాదని, ఉగ్రవాద సంస్థ అని, టర్కీ పార్లమెంట్‌పై ఆ సంస్థ చేసిన దాడిని ప్రపంచదేశాలు హెచ్చరికగా తీసుకోవాలని హైదరాబాద్‌లోని టర్కీ కాన్సులేట్ జనరల్ అద్నాన్ అల్టే అల్టీనోర్స్ పేర్కొన్నారు. టర్కీ కాన్సులేట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేండ్ల కిందట ఫెటో ఉగ్రవాద సంస్థ టర్కీ పార్లమెంట్‌పై దాడి చేసిందని, కొంత ప్రాణనష్టం జరిగినా దాడిని టర్కీ ప్రభుత్వం తిప్పి కొట్టిందని తెలిపారు. 1970లో ఫెతూల్లా గులెన్ అనే ఉపాధ్యాయుడు ప్రారంభించిన ఫెటో సంస్థ 165 దేశాల్లో తమ కార్యాకలాపాలు సాగిస్తుందన్నారు. సేవా సంస్థలు, విద్యా సంస్థల ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదన్నారు.

భారతదేశంలో, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఫెటో వ్యాప్తి చెందిందన్నారు. టర్కీస్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (టిక్కి) సంస్థ తమకుతాముగా ఇండియా, టర్కీల మధ్య వ్యాపార భాగస్వామిగా, వ్యాపార అనుసంధానకర్తగా చెప్పుకొంటుందని, ఇండియాలగూ ఫౌండేషన్ అనే సంస్థ తనకుతాను అంతర్జాతీయ శాంతి సంస్థగా చెప్పుకొంటుందని, ఇక్బాలియా ఇంటర్నేషన్ స్కూల్స్, ఇక్బాలియా జూనియర్ కాలేజీలు ఫెటో అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థుల మనసుల్లోకి ఫెటో భావజాలాన్ని చొప్పిస్తున్నారని కాన్సులర్ జనరల్ అద్నాన్ అభిప్రాయపడ్డారు. వీటిలో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి సంస్థలపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో 800 విద్యా సంస్థలు, వెయ్యి స్వచ్ఛంద సంస్థలు, 200కుపైగా మీడియా సంస్థలు, 500 ప్రైవేట్ కంపెనీల్లో ఫెటో ఉందన్నారు. ఈ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు ఆయా దేశాలకు టర్కీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles