విచారణకు హాజరు కాలేను!


Fri,July 12, 2019 01:36 AM

Alanda media case actor shivaji email to cyberabad police

- సైబరాబాద్ సైబర్‌క్రైం విచారణకు గైర్హాజరయిన నటుడు శివాజీ
- కొడుకును అమెరికాకు పంపే పనిలో ఉన్నానని ఈమెయిల్ ద్వారా సమాచారం


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అలంద మీడియా కేసులో గురువారం విచారణకు నటుడు శివాజీ గైర్హాజరయ్యారు. విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు గురువారం సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఈమెయిల్‌లో సూచించినట్టు తెలిసింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తోపాటు శివాజీపైనా సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ నెల 2న అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎయిర్‌పోర్టు నుంచి శివాజీని సైబర్‌క్రైం స్టేషన్‌కు తరలించారు. విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు అందించారు.

92
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles