అనీస్-ఉల్-గుర్బా నిర్మాణ వేగంపెంచండి


Thu,September 12, 2019 02:34 AM

Akbaruddin Owaisi inspects Anees ul Ghurba work

-ఇంజినీర్లను ఆదేశించిన వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనాథ పిల్లలకు వసతి కల్పించడం కోసం తలపెట్టిన అనీస్-ఉల్-గుర్బా నిర్మాణాన్ని వేగవంతంచేయాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం ఇంజినీర్లను ఆదేశించారు. భవన నిర్మాణ పనులపై బుధవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలవారీగా పనులను పర్యవేక్షిస్తూ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదలచేసిందని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మైనా ర్టీ సంక్షేమశాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, టెమ్రీస్ కార్యదర్శి షఫిఉల్లా, వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్‌హమీద్, చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.

129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles