27న బీబీనగర్ ఎయిమ్స్ కాలేజీ ప్రారంభం


Mon,August 19, 2019 02:01 AM

AIIMS Bibinagar to Open on August 27

-ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి
-50 మందికి బోధన, వసతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నానికి, టీఆర్‌ఎస్ ఎంపీల పోరాటానికి, వైద్యారోగ్యశాఖ కృషికి ఫలితం దక్కింది. తెలంగాణలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కళాశాల ఈ విద్యాసంవత్సరమే ప్రారంభానికి సిద్ధమైంది. బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలను ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం మొదటిబ్యాచ్ 50 మంది విద్యార్థులకు ఈ ఏడాది నుంచి బోధన, వసతి కల్పించనున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలోనే బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహించేందుకు కౌన్సెలింగ్ ద్వారా 50 సీట్లను భర్తీచేశారు. ప్రస్తుతం నిమ్స్ భవనాల్లో వైద్య కళాశాలను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే సం వత్సరం నాటికి ఎయిమ్స్ భవనాల నిర్మాణం పూర్తికానుంది. వసతులు పూర్తయ్యేవరకు తెలంగాణ ఎయిమ్స్ పర్యవేక్షణ బాధ్యతను కేంద్రం ప్రస్తుతానికి భోపాల్ ఎయిమ్స్‌కు అప్పగించింది. ఈ నెల 27న బీబీనగర్ ఎయి మ్స్ వైద్యకళాశాల ప్రారంభించాల్సి ఉన్నందున నిర్మాణ పనులను, సదుపాయాలను ఎయిమ్స్ చీఫ్ డైరెక్టర్ శర్మణ్‌సింగ్ ఆదివారం పరిశీలించారు. కళాశాలకు అవసరమయ్యే వైద్యులు, బోధనా సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు.

417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles