ఉపాధి చూపేలా అగ్రి పాలిటెక్నిక్ కోర్సులు


Fri,July 12, 2019 01:47 AM

Agri polytechnic courses for employment

వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్నవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేలా వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్‌కుమార్ వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో తొలి విడుత కౌన్సెలింగ్‌ను ఆయన గురువారం ఉదయం వర్సిటీ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. సీట్ల భర్తీ పారదర్శకంగా జరుగుతున్నదని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. సాత్విక అనే విద్యార్థికి పాలిటెక్నిక్ మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని అందించి కౌన్సెలింగ్‌ను రిజిస్ట్రార్ ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం కౌన్సెలింగ్ అనంతరం సీట్ల లభ్యత తాజా సమాచారాన్ని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles