అమరులకు అంకితం ఎక్కా యాదగిరిరావు


Thu,January 26, 2017 06:58 PM

aekka yadagiri rao interview on  Padma Shri Award

Ekka-Yadagiri-Rao
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆధునికశిల్పి, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని తీర్చిదిద్దిన శిల్పకళాకారుడు ఎక్కా యాదగిరిరావును ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణతో తన అనుభవాలను పంచుకున్నారు.

ప్రశ్న. పద్మశ్రీ లభించడంపై మీ స్పందన ?


జవాబు.. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణకోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరులకు, వారి త్యాగాలకు ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా. అద్భుతమైన, మహోన్నతమైన తెలంగాణ ఆవిష్కృతం కావాలని నా ఆశ. అప్పుడే నాకు నిజమైన సంతోషం.

ప్ర.శిల్పకళను ఎందుకు ఎంచుకున్నారు?


జ. మిగతా కళలేవి రూపుదిద్దుకోకముందే శిల్పశాస్త్రం ఉనికిలోకి వచ్చింది. వేల ఏండ్లుగా లింగరూపంలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శివమూర్తి రూపం సనాతనమైన శిల్పకళకు ప్రత్యక్ష నిదర్శనం.

ప్ర. ఆధునిక శిల్పకళలో మీ కృషిని వివరిస్తారా..


జ. ఆధునిక శిల్పకళ ద్వారానే నేను ప్రపంచమంతా పరిచయమయ్యాను. ప్రపంచంలో పేరెన్నికగల ఆర్ట్‌గ్యాలరీల్లో స్థానం సంపాదించుకున్నా. పికా సో చిత్రాల వరుసలో నా బొమ్మలున్నాయి. తెలంగాణ మట్టి నుంచి నేర్చుకున్నదంతా ప్రపంచానికి చెప్పా. అమరుల స్థూపాన్ని ప్రాచీన శిల్పకళారూపంలో చెప్పడం కష్టం. అందుకే ఆధునిక శిల్పకళలో స్థూపాన్ని తీర్చిదిద్దా.

ప్ర. గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం గురించి ..


జ. తెలంగాణ అమరులను చిరస్మరణీయం చేసే ప్రయత్నమే గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం. 1969 తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో 360 మంది చనిపోయారని చెప్పడానికి నల్లఫలకంపైన నాలుగువైపుల ఒక్కొక్క ఫలకంపై తొమ్మిదిబుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చా. అంటే పదిజిల్లాలలో 360 మంది అమరులయ్యారని తెలంగాణ గాయాలమయమైందని చెప్పే ప్రయత్నం చేశా. ఉమ్మడిరాష్ట్రంలో అమరులకు పూలనివాళి ఇస్తారో, ఇవ్వరోనని నిరంతరం అమరులకు మల్లెమొగ్గలు నివాళులు ఇస్తున్నట్టుగా స్థూపం పై భాగాన మల్లెమొగ్గలను చెక్కాను. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరుల స్థూపం ఒక చారిత్రాత్మక ప్రదేశమయ్యింది. ఈ స్థూపానికి నివాళులు అర్పించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకారం చేశారు. ఇది తెలంగాణ అమరుల పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న భక్తికి నిదర్శనం.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles