పీఆర్ ట్రిబ్యునల్ బాధ్యతల స్వీకరణ

Sat,November 9, 2019 01:28 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/రంగారెడ్డి కోర్టు: గ్రామపంచాయతీలకు అధికారాలు, నిధులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బండారి భాస్కర్, సభ్యులుగా గటిక అజయ్‌కుమార్, పులిగారి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులను మంత్రి ఎర్రబెల్లి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో మెరుగైన పాలన అందించేందుకు పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా తప్పుచేసిన ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

99
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles