నేటి నుంచి పారామెడికల్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ


Sat,September 14, 2019 12:48 AM

Adoption of applications for paramedical degree courses from today

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నర్సింగ్, ఫిజియోథెరపి, ల్యాబ్ టెక్నాలజీ పారామెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్యవిజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం ఒక ప్రకటన జారీచేసింది. కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను పొందుపరచనున్నట్టు, పూర్తి వివరాలకు knruhs.in, knruh s.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సిందిగా వెల్లడించింది.

351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles