మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా


Thu,September 12, 2019 02:26 AM

Adjournment hearing on municipal elections

-లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముందు చేపట్టాల్సిన ప్రక్రియపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ మరోమారు వాయిదా పడింది. వార్డుల విభజనను నిబంధనల ప్రకారం చేపట్టలేదని దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం హైకోర్టు చీఫ్‌జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లలో పూర్తి వివరాలను అధ్యయనం చేయడానికి పిటిషనర్లు, మున్సిపల్‌శాఖ లిఖితపూర్వక వాదనలు దాఖలుచేయాలని ధర్మాసనం ఆదేశించింది. లిఖితపూర్వక వాదనలను పరిశీలించిన తర్వాత తదుపరి విచారణను చేపడుతామని తెలిపింది. ఈ మేరకు విచారణను ఈ నెల 26కు వాయిదా వే సింది. అంతకుముందు విచారణ సందర్భంగా చిన్నచిన్న లోపాలను పెద్దవి చే యొద్దని.. జూలై నుంచి కేసు పెండింగ్ లో ఉన్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles