కేసీఆరే నా నేత


Thu,September 12, 2019 03:10 AM

Adilabad MLA Jogu Ramanna praises CM KCR

- ఆయన సారథ్యంలోనే పనిచేస్తా
- అజ్ఞాతంలోకి వెళ్లలేదు
- ఆరోగ్యం బాగలేక దవాఖానలో చేరిన
- ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న


ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆరే తమ నేత అని, ఆయన సారథ్యంలోనే కలిసి పనిచేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చెప్పారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఫోన్ స్విచాఫ్ చేశానని తెలిపారు. తాను ఎవరికీ అందుబాటులో లేకపోయానని.. దీన్ని మీడియా తప్పుగా అర్థంచేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ వర్గంలో పుట్టిన తాను గ్రామస్థాయిలో యూత్ లీడర్, వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యాన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేకుండా టీడీపీ, టీఆర్‌ఎస్‌లో పనిచేశానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేసి రాత్రి పగలు కష్టపడి పనిచేశానని..

తనకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యానని.. దీంతో బీపీ పెరిగి దవాఖానలో చేరాల్సివచ్చిందని తెలిపారు. తనకు మంత్రి పదవి రానందుకు నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని, ఆత్మహత్యయత్నాలు చేయకూడదని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, వైస్‌చైర్మన్ ఆరె రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనీశా, ఐసీడీఎస్ కార్యనిర్వాహకురాలు కస్తాల ప్రేమలత, మునీస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles