చిన్నపరిశ్రమలపై సీఎం పెద్దమనసు

Tue,February 19, 2019 03:23 AM

-కుషాయిగూడలోని పరిశ్రమల తరలింపునకు చర్యలు
-నగరశివార్లలో 300 ఎకరాల సేకరణ
-174 మంది పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు

చర్లపల్లి: అన్నివర్గాల సంక్షేమంతోపాటు పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కృషిచేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికరంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవడంతోపాటు పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వెంటనే అన్ని అనుమతులు ఇవ్వడమేకాకుండా పరిశ్రమలకు అనువైన స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. తాజాగా కుషాయిగూడ పారిశ్రామికవాడలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి స్థలాలు కేటాయించడంతో వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పదిహేను వందలకు పైగా చిన్న పరిశ్రమలున్న కుషాయిగూడ పారిశ్రామికవేత్తలకు మొదటి విడుతగా టీఎస్‌ఐఐసీ ద్వారా యాద్రాది భువనగిరి జిల్లా, రాయరావుపేటలోని సుమారు 40 ఎకరాల స్థలం కేటాయించడంతోపాటు, 450 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు విభజించిన 174 యూనిట్లకు ప్లాట్లు కేటాయించారు. మూడు గ్రీన్‌బెల్టులను ఏ ర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. మరి న్ని యూనిట్లకు టీఎస్‌ఐఐసీ అధికారులు యా దాద్రి భువనగిరి జిల్లా మదాపూర్‌లో సుమారు 300 ఎకరాల స్థల సేకరిస్తున్నారు.

ప్రోత్సహించడం హర్షణీయం

పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కోసం రెండు ద శాబ్దాలుగా ఎదురుచుస్తున్నాం. మొదటి విడతలో 174 యూనిట్లకు టీఎస్‌ఐఐసీ స్థలాలు కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ విద్యుత్ ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేయడం సంతోషకరం.
-బాల్‌నర్సింహగౌడ్, అధ్యక్షుడు కాప్రా పరిశ్రమల యజమానుల సమాఖ్య

ప్రభుత్వ కృషి మరువలేనిది

యజమానులు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మరువలేనిది. స్థలాలు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-నెర్లకంటి శ్రీనివాస్, కార్యదర్శి, కాప్రా పరిశ్రమల యజమానుల సమాఖ్య

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles