విశాఖలో మహిళపై యాసిడ్ దాడి

Thu,December 5, 2019 01:17 AM

విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వివాహిత (26) సమతానగర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి బుధవారం వచ్చారు. సాయంత్రం ఇద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి వివాహితపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. ఆమె మోచేయి, ఛాతి, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. బాధితురాలిని గాజువాకలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నది. దాడికి కారణాలు తెలియలేదు.

80
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles