ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్


Fri,July 12, 2019 01:58 AM

ACB Traped K P Naik Assistant Pension Payment Officer

-పెన్షన్ ఎరియర్స్ మంజూరుకు 7 వేలు డిమాండ్
-లంచంతీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

గౌతంనగర్: పెన్షన్ ఎరియర్స్ (బకాయి) డబ్బులు మంజూరుచేసేందుకు అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్ కేపీ నాయక్ రూ.7 వేలు లంచం డిమాండ్‌చేశాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి ప్రశాంత్‌నగర్‌లోని పెన్షన్ పేమెంట్ కార్యాలయంలో గురువారం కేపీ నాయక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఏస్పీ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌లో నివాసముంటున్న కేపీనాయక్ ప్రశాంత్‌నగర్‌లోని పెన్షన్ కార్యాలయంలో అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

acb2
ఆర్‌అండ్‌బీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసే సుబ్బులాల్ 1987లో రిటైర్డ్ అయ్యారు. 2012లో ఆయన మరణించాడు. తన భర్త పెన్షన్‌తోపాటు ఎరియర్స్ డబ్బులు సెటిల్ చేయాలని సుబ్బులాల్ భార్య అనుషుబాయి పలుమార్లు కేపీ నాయక్‌ను కోరారు. న్యాయవాది అయిన తన కుమారుడు కిరణ్‌కుమార్‌తో కలిసి ఆమె గత డిసెంబర్ నుంచి విజ్ఞప్తిచేస్తుండగా ఎరియర్స్‌లో 15 శాతం డబ్బులు లంచంగా ఇవ్వాలని కేపీనాయక్ డిమాండ్‌చేశాడు. దీంతో కిరణ్‌కుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు. గురువారం కార్యాలయంలోనే బాధితుడి నుంచి కేపీనాయక్ రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles