లంచంగా బంగారు నెక్లెస్

Sun,October 13, 2019 01:51 AM

దీపావళి గిఫ్ట్ తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన ఇంచార్జి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దీపావళి పండుగకు బంగారు నెక్లెస్ కావాలని అడిగి మరీ చేయించుకొని బాధితుడి నుంచి తీసుకొంటుండగా హైదరాబాద్ ఇంచార్జి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి శనివారం ఏసీబీకి చిక్కారు. మాదాపూర్‌లోని సూర్యా అపార్ట్‌మెంట్‌లో రూ.1.10 లక్షల విలువైన బంగారు నెక్లెస్ తీసుకొంటూ దొరికారు. బోయినపల్లికి చెందిన జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ కంట్రోల్ అధికారులను తనిఖీ నివేదిక పంపకుండా ఉండేందుకు ఆ సంస్థ సీఈవో లింగంపల్లి లక్ష్మిరెడ్డిని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి లంచం డిమాండ్ చేశారు. తొలివిడుతగా ఈ నెల 5న రూ.50వేలు నగదు తీసుకొన్నది. దీపావళి గిఫ్ట్‌గా బంగారు నెక్లెస్ కావాలంటూ అడిగారు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు శనివారం నెక్లెస్ తీసుకొంటుండగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు.

2199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles