ఆధారాల కోసం ఆరా

Sun,October 13, 2019 01:33 AM

-ఐఎంఎస్ మందుల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఏసీబీ
-పలు అంశాలపై నిందితులను ప్రశ్నించిన అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంచలనాలు సృష్టిస్తున్న ఐఎంఎస్ మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరంచేశారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఆర్సీపురం ఈఎస్‌ఐ దవాఖాన సీనియర్ అసిస్టెంట్ ముదిమెల సురేంద్రనాథ్‌బాబు, లైఫ్ కేర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఎండీ బద్దం సుధాకర్‌రెడ్డి, బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ చెరుకు అరవింద్‌రెడ్డి, నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఫార్మసిస్టు కొడాలి నాగలక్ష్మిని కోర్టు అనుమతితో రెండురోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు.. కస్టడీలో తొలిరోజైన శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలను నలుగురు నిందితులకు చూపుతూ వారిని వేర్వేరుగా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో పట్టుబడిన మిగతా వ్యక్తులతో వారికి గల సంబంధాలు, నిధుల గోల్‌మాల్‌లో వారి పాత్ర, ఎన్ని నిధులను పక్కదారి పట్టించారు? ఆ నిధులతో ఎక్కడెక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు? తదితర అంశాలపై ఆరాతీసిన ఏసీబీ అధికారులు.. ఆదివారం మరోమారు ఈ నలుగురు నిందితులను ప్రశ్నించనున్నారు.

69
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles