ఎక్సైజ్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు


Thu,June 20, 2019 02:28 AM

ACB attacks on excise offices

-టాస్క్‌ఫోర్స్ సీఐ,ఎస్సైలపై కేసు
నిజామాబాద్ క్రైం: ఓ కల్లుబట్టి నిర్వాహకుడిని డబ్బుల కోసం బెదిరించినట్టు వచ్చిన ఫిర్యా దు మేరకు ఏసీబీ నిజామాబాద్, మెదక్ జిల్లా అధికారుల బృందాలు దాడులు చేసి నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ టాస్క్‌ఫోర్స్ సీఐ, ఎస్సైలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. నిజామాబాద్ పరిధిలోని గూపన్‌పల్లికి చెందిన రాజాగౌడ్ స్థానికంగా కల్లుబట్టి నడుపుతుంటాడు. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందానికి చెందిన సీఐ జే వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి రాజాగౌడ్‌ను లంచం ఇవ్వమని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు రాజాగౌడ్ నిరాకరించడంతో ఏప్రిల్ 26న టాస్క్‌ఫోర్స్ టీం గూపన్‌పల్లిలో రాజాగౌడ్ కల్లుబట్టికి వెళ్లి షాంపిల్స్ సేకరించారు. అనంతరం రూ.40 వేలు ఇస్తేనే కల్లు షాంపిల్స్ ల్యాబ్‌కు పంపించమని, ఇవ్వని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

దీంతో రాజాగౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ టాస్కఫోర్స్ సీఐ, ఎస్సైలపై ఆధారాలు సేకరించారు. అలాగే నిజామాబాద్‌లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాల యం, టాస్క్‌ఫోర్స్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు కొనసాగించారు.బుధవా రం సాయంత్రం నిజామాబాద్ ఏసీపీ డీఎస్పీ ప్రసన్నరాణి, మెదక్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతిపై కేసులు నమోదు చేసి,అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.

ఏబీసీ వలలో జలమండలి లైన్‌మన్

ఆర్కేపురం: నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా హైదరాబాద్ జలమండలిలో పనిచేసే అల్కాపురి సెక్షన్ లైన్‌మన్‌ను ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. ఆర్కేపురం డివిజన్ వాసవికాలనీలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న మంచినీటి పైపులైన్ల కనెక్షన్ కోసం లైన్‌మన్ శ్రీశైలం ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల లంచం డిమాండ్‌చేస్తున్నాడని అదేకాలనీకి చెందిన రమేశ్ అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. నిఘాపెట్టిన అధికారు లు బుధవారం రమేశ్ మూడు కనెక్షన్లకు రూ.9 వేలను శ్రీశైలానికి ఇస్తుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని గురువారం ఏసీపీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూ ర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌చేస్తే 9440446140 నంబర్‌కు ఫిర్యాదుచేయాలని కోరారు.

1061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles