ఏసీబీకి చిక్కిన మోత్కూరు ట్రాన్స్‌కో ఏఈ


Wed,June 12, 2019 02:16 AM

acb arrested mothkur transco ae

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మో త్కూరు ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణ్‌ప్రతాప్ మంగళవారం రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మురళీమోహన్, కమలకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుండాల మండ లం గంగాపురం గ్రామానికి చెందిన రైతు శ్యా మల లకా్ష్మరెడ్డి గోశాల నిర్వహణకు విద్యుత్ మోటర్ కనెక్షన్ కోసం రూ.5,790 డీడీ తీసి గత నెల 29న మోత్కూరు ట్రాన్స్‌కో ఏఈ, గుండాల మండల ఇంచార్జి ఏఈ లక్ష్మణ్‌ప్రతాప్‌కు అందజేశారు. అదే రోజు ఏఈ ఆన్‌లైన్‌లో నమోదు చేశాడు. కాగా కనెక్షన్ మంజూరు కో సం ఏఈ లక్ష్మణ్ ప్రతాప్ లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం బీబీనగర్ ఎస్‌బీఐ సమీపంలో రైతు లకా్ష్మరెడ్డి నుంచి ఏఈ రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప ట్టుకున్నారు. ఏఈ లక్ష్మణ్‌ప్రతాప్‌ను అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకొన్నారు.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles