రెట్టింపు సంబురం


Sun,July 21, 2019 03:16 AM

Aasara Pension Increase Amount Distributed Across State

-ఉత్సవంలా ఆసరా పింఛన్ల పెంపు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
-పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
-ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతల వెల్లువ
-సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ : పేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెంచిన ఆసరా పింఛన్లు లబ్ధిదారుల్లో ఆనం దాన్ని రెట్టింపు చేశాయి. పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా పం డుగ వాతావరణంలో నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయగా, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం గా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశా రు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పేదల కండ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

t-srinivas-yadav
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీలో హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మా ట్లాడుతూ.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పింఛన్ల మొత్తాన్ని పెంచినట్టు తెలిపారు.

koppula-eshwar
జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం లో ప్రొసీడింగ్ పంపిణీలో సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మారిన కాలానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పింఛన్లను పెంచినట్టు తెలిపారు.

కేసీఆర్ సర్కార్‌ను ఆశీర్వదించాలి..

కరీంనగర్ జిల్లా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో ప్రొసీడింగ్ పత్రాల పంపిణీలో వైద్య ఆరో గ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు.

v-prashanth-reddy

బీజేపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో, కామారెడ్డిలో రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల పంపిణీ విషయం లో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలకు చేస్తు న్నారన్నారు.

indrakaran-reddy
నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పా ల్గొన్నారు.

SRINIVAS-GOUD
మహబూబ్‌నగర్‌తోపాటు భూత్పూరులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రొసీడింగ్‌లను పంపిణీ చేశారు.

aasara-pension3
వనపర్తి జిల్లా పెద్దమందడిలో ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి న తరువాత గ్రామస్థులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సహపంక్తి భోజనం చేశారు.

errabelli-dayakar-rao

ఆసరాలో 90 శాతం నిధులు రాష్ర్టానివే..

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఆసరా పింఛన్ల చెల్లింపులో 90 శాతానికిపైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

JAGADISHREDDY

ఉమ్మడి నల్లగొండలో..

నల్లగొండ జిల్లా చిట్యాల, సూర్యాపేట జిల్లా రాయినిగూడెం, పిల్లలమర్రి, గాంధీనగర్, సూర్యాపేటతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం రాష్ర్టానికి సీఎం కేసీఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

ch-malla-reddy
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో మంత్రి చామకూర మల్లారెడ్డి, సిద్దిపేటలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా పరకాల, ఆత్మకూరు మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫించన్ ప్రొసిడింగ్ పత్రాలు అందజేశారు.
POCHAMPALLY-srinivas

harish-rao

s-ravi-shankar

p-devender-reddy

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles