అన్నా.. మీకు రుణపడి ఉంటాం!


Mon,April 16, 2018 03:01 AM

A Stranger message to KTR on KCR Kit

-కేసీఆర్ కిట్‌పై కేటీఆర్‌కు ఓ సామాన్యుడి మెసేజ్
-ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరుగడంపై మంత్రి హర్షం
KTR-tweet
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సర్కారు దవాఖానల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఓ సామాన్యుడు తన భార్యకు సుఖప్రసవం కావడంపై సంతోషం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని ప్రశంసించారు. కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధిపొందిన ఓ సామాన్యుడు తనకు పంపిన మెసేజ్‌పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. నమస్తే అన్నయ్య.. మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామం. నా భార్య భోగలక్ష్మి మునిపాములలోని ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 13న ప్రసవించింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మాకు కేసీఆర్ కిట్ అందించారు. టీఆర్‌ఎస్ పార్టీకి, మీ కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్యూ.. సోమచ్ అంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మెసేజ్‌పై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. లబ్ధిదారుల నుంచి ఇటువంటి మెసేజ్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అవుతున్న వారికి ఎంతో భరోసా దక్కుతున్నదని పేర్కొన్నారు. రెండు లక్షలకుపైగా కేసీఆర్‌కిట్లను అందించామని, సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 40%కుపైగా పెరిగిందని తెలిపారు.

4143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles