మూడు విడుతల్లో పోరు


Tue,April 16, 2019 01:13 AM

A polling station for 400 voters

-400 మంది ఓటర్లకు ఓ పోలింగ్‌కేంద్రం
-ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 400 మంది ఓటర్లుండేలా ఏర్పాట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలోని 535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఏయే మండలాలు, ఏయే జిల్లాల్లో ఏ విడుతలో ఎన్నికలు జరుపాలనేది నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నది. ముందుగా రెండువిడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీస్ బందోబస్తు అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు విడుతల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన షెడ్యూల్ ముసాయిదాలోనే విడుతలవారీగా నిర్వహించే జిల్లా, మండలాలను సైతం ఖరారు చేశారు.

ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికలసంఘం సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వివరించింది.చేశారు. 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 6,540 ఉండగా.. 600 మంది వరకు ఓటర్లున్న కేంద్రాలు 25,467 ఉన్నాయి. మొత్తం 32,007 పోలింగ్ కేంద్రా ల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లుగా 64,014 మందిని నియమించారు. అదేవిధంగా 400 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రానికి ముగ్గురు, 600 మంది ఓటర్లున్న కేంద్రాలకు నలుగురు చొప్పున 1,21,488 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1,47,141 మంది పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు ఎస్‌ఈసీ పేర్కొంది. మొత్తం 13,651 పో లింగ్ లోకేషన్లను ఏర్పాటుచేశారు. 510 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, 129 లెక్కింపు కేంద్రా లు, స్ట్రాంగ్ రూంలను సిద్ధంచేశారు.

54,604 మంది పోలీస్ సిబ్బంది
రాష్ట్రంలోని 535 జెడ్పీటీసీ స్థానాలు, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటివరకు ఉన్న జాబితా ప్రకారం 1,56,11,320 మంది ఓటర్లున్నారు. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ప్రతి కేంద్రంలో నలుగురు చొప్పున పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఇందుకోసం 54,604 మంది పోలీస్ సిబ్బంది అవసరమని గుర్తించింది.

ఒకే విడుతలో ఎన్నికలు జరిగే జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి
రెండు విడుతల్లో జరిగే జిల్లాలు:జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్.

మూడు విడుతల్లో జరిగే జిల్లాలు:ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి,
మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు.

91
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles