పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం


Wed,August 14, 2019 01:09 AM

A moderate rainfall in several districts

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం సాయంత్రం దాకా వర్షాలు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కొత్తగూడలో రెండు ఇండ్లు కూలిపోయాయి. కెరమెరి మండలం లో పెద్దవాగు పొంగడంతో ఖైరి నుంచి మోడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నల్లగొండ జిల్లాలోని 17 మండలాల్లో వర్షం కురిసింది. కేతేపల్లి, నకిరేకల్ నియోజకవర్గాల్లో భారీగా కురవగా, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కనగల్, త్రిపురారంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కేతేపల్లిలో అత్యధికంగా 53.4మి.మీ., అత్యల్పంగా త్రిపురారంలో 3.7 మి.మీ. వర్షపా తం నమోదైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉద యం 7 గంటల వరకు తేలికపాటి జల్లులు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 17.25 మిల్లీమీటర్లు నమో దు కాగా అత్యధికంగా మునగాల మండలంలో 40.8 మి.మీ., మోతె మండలంలో అత్యల్పంగా 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles