పాత ఇనుప సామాన్ల దుకాణంలో పేలుడు

Sat,September 14, 2019 12:49 AM

-ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
సూర్యాపేట సిటీ: సూర్యాపేటలోని పాత ఇనుప సామాన్ల దుకాణంలో రసాయనాలు కలిగిన డబ్బాను ముక్కలుగా చేస్తుండగా పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని జీవీవీ ఫంక్షన్‌హాల్ సమీపంలో శ్రీ వెంకటసాయి ప్లాస్టిక్ వర్క్స్ పాత ఇనుప సామాన్ల దుకాణం ఉన్నది. ఇక్కడ పాత ప్లాస్టిక్ ఇనుప సామాన్ల ను కొనుగోలు చేసి ముక్కలుగా కత్తిరించి ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. శుక్రవారం రసాయనాలు కలిగిన డబ్బాలను ముక్కలుగా కత్తిరిస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. కటింగ్ యంత్రం వద్ద ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన రాంచంద్రసాహు(45) అక్కడికక్కడే మృతి చెందగా, సల్మాన్, జాన్‌బుజ్జి, చిలకమ్మకు గాయాలయ్యాయి.

343
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles