ఉరికురికి.. ఉబికుబికి..


Wed,June 19, 2019 02:49 AM

94 7 m water level in Kannepalli forebay

-గోదారమ్మ ఉప్పొంగుతుందిలా..
-కన్నెపల్లి ఫోర్‌బేలో 94.7 మీటర్ల నీటిమట్టం
-ఆరు మోటర్లను వెట్న్‌క్రు సిద్ధం చేసిన ఇంజినీర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి తల్లి ఉరికురికి.. ఉబికుబికి ఉప్పొంగడానికి సిద్ధమైంది. నీటి విడుదలకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఇంజినీర్లు అన్ని రకాల సాంకేతిక కసరత్తులను పూర్తిచేశారు. ఈ నెల 21న గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర సీఎంల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ జాతికి సమర్పించనున్న నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోత సాంకేతికంగా ఎలా జరుగుతుంది. గోదారమ్మ నదీమార్గం నుంచి మళ్లీ ఏయే నిర్మాణాల ద్వారా ఉప్పొంగుతుందనే అంశాల్ని దృశ్యాలతో పరిశీలిస్తే..

godavari6
కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరి నది ఇది. నదిలోకి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత మేడిగడ్డ బరాజ్‌లో నీరు నిల్వ ఉండి... ఇక్కడివరకు పుష్కలమైన నీటి లభ్యత కనిపిస్తుంది. తద్వారా 350 మీటర్ల అప్రోచ్ చానల్ నుంచి నేరుగా పంపుహౌస్ వైపు నీళ్లు పోతాయి. ప్రస్తుతం నీటి నిల్వ మొదలు కానందున నేరుగా నది నుంచి ఇలా నీటిని కన్నెపల్లి పంపుహౌస్ వైపు మళ్లించారు.

godavari5
ఇది హెడ్‌రెగ్యులేటర్. నదిలో నుంచి జలాలు నేరుగా పంపుహౌస్ వైపు వెళ్లకుండా వరద నియంత్రణకు ఇది దోహదపడుతుంది. ఇక్కడ గేట్లు ఎత్తితేనే జలాలు లోపలికి వెళతాయి. ఇంజినీర్లు మోటర్లు నడిపేందుకు నిర్ణయించిన తర్వాత గేట్లు ఎత్తుతారు. అవసరంలేనపుడు మూసివేస్తారు. నదిలో ఉన్న నీటిమట్టం, మోటర్లు నడిపే సంఖ్య ఆధారంగా ఎన్ని గేట్లు, ఎంతమేర ఎత్తాలనేది నిర్ధారిస్తారు.

godavari3
హెడ్‌రెగ్యులేటర్ గేట్ల ద్వారా వచ్చిన నీళ్లు ఇలా ఫోర్‌బేలోకి చేరతాయి. ఫోర్‌బే అనేది ఒకవిధంగా సర్జ్‌పూల్‌లాంటిది. సాధారణంగా ఇతర పంపుహౌస్‌ల్లో మోటర్లు ఉన్న ప్రాంతానికి సమాంతరంగా తవ్వి సర్జ్‌పూల్‌ను నిర్మిస్తారు. అందులో నుంచి మోటర్ల దిగువకు నీటిని వదులుతారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఫోర్‌బే నిర్మాణాన్నిచేపట్టారు. ఈ ఫోర్‌బేలో నిల్వ సామర్థ్యం 0.02 టీఎంసీలు. ఫోర్‌బేలోకి వచ్చిన నీళ్లు డ్రాఫ్ట్ ట్యూబ్‌ల (ఫోర్‌బే-మోటరు దిగువ భాగానికి మధ్య ఉండే పైపు మార్గం) ద్వారా మోటరు కిందకు పోతాయి.

godavari7
ఇది హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఉండే కొలమానం. ఇక్కడ ఎంతమేర నీటిమట్టం ఉంటుందో ఫోర్‌బేలో కూడా అంతే నీటిమట్టం ఉంటుంది. తద్వారా తెలిసే నీటిమట్టం ఆధారంగా ఎన్ని మోటర్లను నడిపేందుకు వీలున్నదనేది ఇంజినీర్లు నిర్ధారిస్తారు. ఇక్కడ సుమారు 94 మీటర్ల మేర నీటిమట్టం ఉంటే కన్నెపల్లి పంపుహౌస్‌లోని పదకొండు మోటర్లను నడిపేందుకు వీలుంటుందని ఇంజినీర్లు తెలిపారు. వచ్చే వరద ఆధారంగా ఒకేసారి ఎన్ని మోటర్లను నడపవచ్చో అంచనావేస్తారు. ఎందుకంటే ఫోర్‌బేలో నిర్ధారిత స్థాయిలో నీళ్లు ఉంటేనే అవి మోట ర్ల దిగువ భాగానికి వెళ్లి లిఫ్టు చేయడం సాధ్యం అవుతుంది. వచ్చే వరద తక్కువ గా ఉన్నపుడు ఎక్కువ మోటర్లను నడిపి తే ఫోర్‌బేలో నీటి లభ్యత అయిపోతుం ది. తద్వారా సాంకేతికంగా ఇబ్బంది వస్తుంది. అందుకే ఈ కొలమానం వద్ద వెల్లడయ్యే నీటిమట్టం, వచ్చే వరద ప్ర వాహాన్ని లెక్కించి మోటర్లను నడపడం పై ఇంజినీర్లు ఓ నిర్ణయానికి వస్తారు.

godavari4
ఇవి కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల పైభాగం. ఫోర్‌బే నుంచి డ్రాఫ్ట్‌ట్యూబ్‌ల ద్వారా వచ్చే నీటిని ఈ మోటర్లు ఎత్తిపోస్తాయి. కన్నెపల్లి పంపు హౌస్‌లో ఒక్కో మోటరు సామర్థ్యం 40 మెగావాట్లు. ఒక్కో మోటరు ద్వారా 2118 క్యూసెక్కుల నీళ్లు డిశ్చార్జి అవుతాయి. అంటే 11 మోటర్ల నుంచి దాదాపు 23,166 క్యూసెక్కులు (రెండు టీఎంసీలు) విడుదలవుతాయి. ప్రస్తుతం రెండు టీఎంసీల ఎత్తిపోతకు పదకొండు మోటర్లను అమరుస్తున్నారు. మున్ముందు అదనంగా మరో టీఎంసీని ఎత్తిపోసేందుకుగాను
అవసరమైన మోటర్లను బిగిస్తారు. అందుకు సంబంధించి వాటిని అమర్చే ప్రాంతంలో సివిల్ పనులు ఇప్పటికే పూర్తిచేశారు.

godavari2
ఇది డెలివరీ సిస్టర్న్. పంపుహౌస్‌లోని మోటర్లు ఎత్తిపోసిన నీళ్లు డెలివరీ పైపుల ద్వారా ఈ డెలివరీ సిస్టర్న్‌లో పడతాయి. సిస్టర్న్ అంటే ఒక చిన్నపాటి రిజర్వాయర్‌లాంటిది. ఒక్కో మోటరు ద్వారా ఎత్తిపోసే నీళ్లు రెండు పైపుల ద్వారా ఈ సిస్టర్న్‌లోకి పడతాయి. అంటే పదకొండు మోటర్ల నుంచి ఎత్తిపోసే నీళ్లు 22 పైపుల ద్వారా విడుదలవుతాయి. మున్ముందు అదనంగా ఆరు మోట ర్లు వస్తున్నందున 34 పైపుల ద్వారా నీళ్లు రానున్నాయి. సివిల్ పనుల్లో భాగంగా ఇక్కడ 34 పైపులను అమర్చారు. డెలివరీ సిస్టర్న్‌లో పడిన గోదావరిజలాలు గ్రావిటీకాల్వ ద్వారా ముందుకుపోతాయి. 13.34 కి.మీ.మేర నిర్మించిన ఈ గ్రావిటీ కాల్వనుంచి ప్రస్తుతం రోజుకు రెండు టీ ఎంసీలు.. మున్ముందు మూడు టీఎంసీలు అన్నారం బరాజ్‌లో పడనున్నాయి. అందుకే మూడు టీఎంసీల తరలింపునకు అనుగుణంగా ఈ గ్రావిటీ కాల్వను నిర్మించారు.

4097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles