స్వతంత్రుల కోసం 87 గుర్తులు


Wed,September 12, 2018 01:26 AM

87 marks for independents

-ఆఖరున నోటా.. జాతీయ పార్టీలు ఆరు
-దేశంలో కారు గుర్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్
-గుర్తులు ఖరారుచేసిన ఎన్నికల సంఘం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చెప్పులు, హెల్మెట్, మిరపకాయ, చెస్‌బోర్డు, క్యాబేజీ, మిరపకాయ, టెంట్, గోర్ల కత్తెర, ఐస్‌క్రీం.. ఇవన్నీ ఈవీఎంల్లో కనిపించే గుర్తులు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రగా పోటీచేసే అభ్యర్థుల కోసం 87 రకాల గుర్తులు కేటాయించారు. అభ్యర్థులు ఎంతమంది పోటీలో ఉన్నా.. ఆఖరున నోటా ఉంటుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తించిన రాజకీయ పార్టీలతోసహా.. స్వతంత్రంగా బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులను ఎన్నికల సంఘం విడుదలచేసింది.

జాతీయ పార్టీల గుర్తులివే

కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో ఆరు జాతీయ పార్టీలు నమోదయ్యాయి. బీఎస్పీకి ఏనుగు గుర్తు, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి కొడవలి, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు హస్తం, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి గడియారం గుర్తులు జాబితాలో ఉన్నాయి.

కారు గుర్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్

కేంద్ర ఎన్నికల సంఘం జాబితా ప్రకారం ఆయా రాష్ర్టాల్లో ఆయా పార్టీలవారీగా పలు గుర్తులు కేటాయించినప్పటికీ.. కారు గుర్తు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీకే ఉన్నది. మిగతా రాష్ర్టాల్లో ఏ పార్టీకి కూడా కారు గుర్తు కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్‌కు కారు గుర్తు, టీడీపీకి సైకిల్, ఎంఐఎంకి గాలిపటం, వైఎస్సార్‌సీపీకి ఫ్యాను గుర్తులుగా జాబితాలో పేర్కొన్నారు. సైకిల్ గుర్తును జమ్మూకశ్మీర్‌లోని జమ్మూకశ్మీర్ నేషనల్ ఫాంథర్స్ పార్టీకి, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కూడా కేటాయించారు.

స్వతంత్రులకు కేటాయించే గుర్తులివే..

ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ గుర్తుల జాబితాను వెల్లడిస్తున్నారు. స్వతంత్రుల కోసం 87 గుర్తులను కేటాయించారు. అల్మారా, ఏసీ, ఆటోరిక్షా, బెలూన్, పండ్లగంప, బ్యాట్, బ్యాట్స్‌మెన్, టార్చిలైట్, బెల్ట్, బ్లాక్‌బోర్డు, సీసా, బ్రెడ్, సూట్‌కేసు, కలర్స్‌బ్రష్, బకెట్, కేక్, క్యాలెండర్, కెమెరా, కొవ్వొత్తి, క్యారంబోర్డు, తివాచీ, క్యారెట్, కాలీఫ్లవర్, సీలింగ్‌ఫ్యాన్, చెప్పులు, చెస్‌బోర్డు, కోటు, కొబ్బరిచిప్ప, మంచం, కప్పు-సాసర, కటింగ్ ప్లేయర్, వేటకత్తి, డీజిల్ పంప్, డిష్ యాంటీనా, పల్లకీ, విద్యుత్ స్తంభం, ఎన్వలప్‌కవర్, ఫ్లూట్, గౌను, కూరగిన్నె, గౌర, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌స్టవ్, గాజుగ్లాసు, ద్రాక్ష, మిర్చి, హార్మోనియం, టోపీ, హెల్మెట్, హాకీస్టిక్ బాల్, ఐస్‌క్రీం, ఇస్త్రీపెట్టె, కేతిరి, పతంగి, లేడీస్‌పర్సు, లెటర్‌బాక్స్, మిక్సీ, గోర్ల కత్తెర, టై, పెన్ను నిబ్, పెన్ను స్టాండ్, పెన్సిల్ షార్పనర్, ప్లేట్ స్టాండ్, కుండ, ప్రెషర్ కుక్కర్, రేజర్, ఫ్రిజ్, ఉంగరం, రంపం, స్కూల్‌బ్యాగ్, కత్తెర, కుట్టుమిషన్, షటిల్, పలక,స్కెతస్కోప్, స్టూల్, టేబుల్, టేబుల్‌ల్యాంపు, టెలిఫోన్, టీవీ, టెంట్, టూత్‌బ్రష్, సన్నాయి, వయోలిన్, వాకింగ్‌స్టిక్, కీసుపిట్ట, కిటీకీ గుర్తులు స్వంత్రులకు కేటాయించే జాబితాలో ఉన్నాయి.

959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles