కమ్ముకున్న నీలి మబ్బులు

Tue,February 12, 2019 04:34 AM

-75% పెరిగిన బూతు చిత్రాల వీక్షణ
-అవకాశమిస్తున్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు
-డాక్‌ఆన్‌లైన్ సర్వేలో వెల్లడి
-తగ్గుతున్న లైంగిక సామర్థ్యం
-పెరుగుతున్న పునరుత్పత్తి సమస్యలు
-సామాజిక సమస్యగా మారే అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నానాటికీ ఆధునికతను సంతరించుకుంటున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. అవధుల్లేని మానవ ప్రగతిని సాక్షాత్కరింపజేస్తున్నది. సక్రమ వినియోగంతో మానవ వికాసానికి, సామాజిక అభివృద్ధికి బాటలు తీస్తున్నది. అదే పరిజ్ఞానం.. తప్పుడు వినియోగాలతో ఒక తీవ్ర సామాజిక సమస్యకు కూడా కారణమవుతున్నది. అదే పోర్నోగ్రఫీ! ప్రజలకు అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ డాటా.. స్మార్ట్‌ఫోన్లు ఇంటర్నెట్‌లో బూతు చిత్రాలను చూసేవారి సంఖ్యను పెంచుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన రెండేండ్లలో ఇంటర్నెట్ సహకారంతో పోర్న్ చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు వెల్లడైంది. ఈ నెల 12న సెక్సువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్‌నెస్ డే సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా టెలిమెడిసిన్ ఆన్‌లైన్ సేవలు అందిస్తున్న డాక్‌ఆన్‌లైన్ సంస్థ ఆన్‌లైన్‌లో ఒక సర్వే నిర్వహించింది.

18 నుంచి 50 ఏండ్ల వయస్సున్న సుమారు 5000 మందిని (ఇందులో 3500 మంది మగవారు, 1500 మంది మహిళలు) సర్వే చేయగా.. ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో పోర్న్ చిత్రాలు చూసేవారి సంఖ్యతోపాటే.. వారిలో లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. మొత్తం ఐదువేల మందిని సర్వే చేయగా.. పోర్న్ చిత్రాలు చూస్తున్నామని 78% పురుషులు, 11% మహిళలు పేర్కొన్నారు. శృంగారంలో అసంతృప్తి కారణంగా పోర్న్‌వైపు మొగ్గుచూపుతున్నవారు పురుషుల్లో 52%, మహిళల్లో 60% ఉన్నట్టు వెల్లడైంది. ఇక శృంగారం పట్ల అయిష్టత, చురుకైన భాగస్వామ్యం లేకపోవడం కారణంగా నీలి చిత్రాలు చూసేవారు పురుషుల్లో 84%, మహిళల్లో 38% ఉన్నట్టు సర్వే పేర్కొంది.

pornography4

స్మార్ట్‌ఫోన్‌తో తీవ్ర నష్టం..

ఆధునిక జీవనగతిని మార్చిన స్మార్ట్‌ఫోన్, అగ్గువకే అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ డాటాతో రెగ్యులర్‌గా నీలి చిత్రాలు చేసేవారి సంఖ్య పెరుగుతున్నదని సర్వే పేర్కొంటున్నది. 2017తో పోల్చితే పోర్న్ చూసేవారు 75 శాతం పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. ప్రత్యేకించి గడిచిన రెండేండ్లలో శృంగారపరమైన ఆరోగ్యం, పునరుత్పత్తి శక్తిపై పోర్న్ వీక్షణ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తేలింది. దీనిని ఇక్కడే కట్టడి చేయకపోతే తీవ్ర సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందని ఈ సర్వే హెచ్చరిస్తున్నదని డాక్‌ఆన్‌లైన్ పేర్కొంది. పోర్న్ చూస్తున్నవారు.. అందులో చూపిస్తున్నదానికి, వాస్తవ శృంగారానికి మధ్యన తేడా గమనించలేక సైకలాజికల్‌గా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్టు తెలిపింది.

pornography3

ఆధునిక జీవనశైలితో..

ఈ డిజిటల్ యుగంలో వృత్తిపరమైన, సామాజిక ఒత్తిడికితోడు.. పరిమితిని మించి ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ఫోన్లు, మరీ ముఖ్యంగా వైఫై విపరీతంగా వాడటంవల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోతున్నదని డాక్‌ఆన్‌లైన్ పేర్కొంది. దీనికితోడు పిల్లలకోసం పడే మానసిక సంఘర్షణతో చుట్టుపక్కల వాతావరణంకూడా ఒత్తిడికి గురిచేస్తుండటంతో.. పోర్న్ చూసి ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందుతున్నారని తెలిపింది.

హద్దుమీరితే వ్యతిరేక ఫలితాలు

అతి సర్వత్ర వర్జ్యయేత్. ఏదైనా హద్దుమీరితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ను చూస్తే.. సమాజంలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. పోర్న్ చూస్తూ ఊహాలోకంలో విహరించడం వల్ల పురుషులు, మహిళల్లో శృంగారంపై అనాసక్తి నెలకొంటుంది.
- డాక్టర్ సయ్యద్ అబ్రార్ కరీం, ఫిజిషియన్
pornography2

7706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles