తెలంగాణ పునర్నిర్మాణంలో.. ఇంజినీర్లది ముఖ్యపాత్ర


Fri,July 12, 2019 02:12 AM

6th Telangana Engineers day celebrations at Khairathabad

-సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్
-తెలంగాణ ఇంజినీర్స్ డేలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
-నలుగురు ఇంజినీర్లకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజినీర్లది ముఖ్యమైన పాత్ర అని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ 142వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్, రోడ్లు, భవనాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని (జూలై 11న) ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంజినీర్ కాదు కానీ, సోషల్ ఇంజినీర్ అని అభివర్ణించారు. రా ష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆశయాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు తెలిపారు.

ts-engineers3

ఇంజినీర్లకు జీవిత సాఫల్య పురస్కారం

ఇంజినీరింగ్ విభాగంలో విశిష్ట సేవలందించి వివిధస్థాయిల్లో ఉన్న రిటైర్డ్ ఇంజినీర్లకు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు) అందజేశారు. పురస్కారం అందుకున్నవారిలో తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, మిషన్ భగీరథ అడ్వైజర్ జిల్లాపురం జ్ఞానేశ్వర్‌రావు, రిటైర్డ్ ఇంజినీర్లు వెంకటరామారావు, బీ కిషన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునిల్ శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ (రాష్ట్రరోడ్లు) పీ రవీందర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ (ఎన్‌హెచ్, సీఆర్‌ఎఫ్ అండ్ భవనాలు) గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ గౌరవ చైర్మన్ జీ రామేశ్వర్‌రావు, చైర్మన్ టీ వెంకటేశం, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ts-engineers4

కాళేశ్వరం ఈఎన్సీకి మంత్రి కొప్పుల సన్మానం

ప్రపంచంలోనే అద్భుతంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఫలితాలను ప్రజలకు అందించడంలో సఫలీకృతుడైన ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కృషి అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మంథని గోదావరితీరంలో నల్లా వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించారు.
ts-engineers5

ts-engineers6

204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles