తిరిగిన 6,106 బస్సులు

Mon,November 11, 2019 02:49 AM

-మెరుగైన ఆర్టీసీ సేవలు
-షెడ్యూల్ ప్రకారం బస్సుల రాకపోకలు

హైదరాబాద్, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్: సమ్మె ప్రభావం లేకుండా ఆర్టీసీ బస్సులు పెద్ద సం ఖ్యలో తిరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆర్టీసీతోపాటు అద్దె బస్సులను కూడా యథావిధిగా నడిపిస్తున్నారు. ఆదివారం మొత్తం 6,106 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. ఇందులో 4,166 ఆర్టీసీ, 1,940 అద్దెబస్సులు ఉన్నాయి.

కరీంనగర్ రీజియన్‌లో..

కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో 633 బస్సులు ప్రయాణికులకు సేవలందిం చాయి. నిజామాబాద్ రీజియన్‌లో 291 ఆర్టీ సీ, 159 అద్దె బస్సులు తిరిగాయి. మెదక్ రీజియన్‌లోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో 626 బస్సులకు గాను 517 బస్సులను నడిస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో 692 బస్సులు నడిచాయి. నల్లగొండ జిల్లాలో 281 బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. సూర్యాపేట జిల్లాలో 171 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా 132 బస్సులు నడిచాయి. ఖమ్మం జిల్లాలో 273 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానా లకు చేర్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220 బస్సులు, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 276 బస్సులు రాకపోకలు సాగించాయి. వికారాబాద్ జిల్లాలో 168 బ స్సులు, నిర్మల్ జిల్లాలో 296 సర్వీసులు తిరిగాయి.
RTC-Buses2

సమ్మెను కొనసాగిస్తాం

- ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వాత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వాత్థామరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎంప్లాయూస్ యూనియన్ కార్యాలయంలో విపక్షాల సమావేశం జరిగింది. సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్షకు నలుగురు కార్మికులు కూర్చుంటారని తెలిపారు. సమావేశంలో వివిధ పార్టీల నేతలు, ఆర్టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కొల్లాపూర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

RTC-Buses1
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ ఆదివారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్‌కు చెందిన సత్యారెడ్డి(35) కొల్లాపూర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమ్మెలో భాగంగా డ్రైవర్ సత్యారెడ్డి ఆదివారం ఉదయం నుంచి దీక్షలో పాల్గొన్నాడు. సాయంత్రం ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి గొంతుకు జీఏ వైర్‌తో మెడకు ఉరివేసుకునే ప్రయత్నం చేయగా డిపో వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై మురళీగౌడ్ సమయస్ఫూర్తితో సిబ్బందితో కలిసి కిందకు దించాడు. వెంటనే ప్రభుత్వ సివిల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.

రాళ్లదాడులపై పోలీసుల నజర్

హైదరాబాద్‌సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో భా గంగా పోలీసులపై రాళ్లు రువ్వి హింసకు ప్రేరేపించిన ఘటనలను నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలపై చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రెండు కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వామపక్ష పార్టీలకు చెందిన వారే పోలీసులపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను, వివిధ చానళ్లలో ప్రసారాలైన రికార్డులను పరిశీలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులను 144,148, 323, 324, 332ఆర్/వై 149 ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles